వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి బిల్ క్లింటన్ తనయ చెల్సియా క్లింటన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Chelsea Clinton
న్యూయార్క్: ఆమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనయ చెల్సియా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అంశాన్ని తోసిపుచ్చారు. ఇప్పుడు ఆమె సమాధానం మాత్రం రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మీరు రాజకీయాల్లోకి రానున్నారా అని ముప్పై రెండేళ్ల చెల్సియాను ప్రశ్నిస్తే ఏమో తెలియదు, చెప్పలేమని అంటున్నారు. గతంలో రాజకీయాల్లోకి రావడాన్ని తిరస్కరించిన ఆమె తెలియదని చెప్పడం ఆమె ఎంట్రీకి సంకేతంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె మునుపటి మాదిరిగా రాజకీయ ప్రవేశాన్ని కాదని తీసిపారేయడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ సంబంధాలపై డాక్టరేట్ చేస్తున్న ఆమె ఎన్‌బిసి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నారు. 2008లో అధ్యక్ష పదవి కోసం తన తల్లి హిల్లరీ చేసిన ప్రయత్నం విఫలమైన ఉదంతంపై వోగ్ పత్రిక సెప్టెంబర్ సంచిక కోసం చెల్సియా ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా, చెప్పలేనని అన్నారు.

తన అమ్మ ఎన్నికల ప్రచారం సమయంలో కాదని చెప్పానని, అదొక్కటనే కాదు కానీ.. తాను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానని, ప్రజలు పూర్తి సమయాన్ని వెచ్చించాలని నన్ను అడుగుతున్నారని ఆమె చెప్పారు. ఓటు వేయడానికి అర్హత వచ్చినప్పటి నుంచి ఓటు వేస్తున్నానని తెలిపారు. సమాన న్యాయం గల ప్రపంచం కోసం తాను తపిస్తున్నట్టు చెప్పారు. బిల్ క్లింటన్ అధ్యక్షునిగా వ్యవహరించినపుడు చెల్సియా పడుచు ప్రాయం శ్వేతసౌధంలోనే గడిచింది.

ఇంతకుముందు తమ హోదా కారణంగా వ్యక్తిగత జీవితం కూడా పదుగురి దృష్టిలో పడిందని చెల్సియా అన్నారు. ఇప్పుడేమో.. కావాలనే ప్రజాజీవితంలోకి అడుగు పెడుతున్నట్టు వ్యాఖ్యానించారు.

English summary
Chelsea Clinton, who on earlier occasions has ruled out stepping into politics, is now giving less definitive answers on her political ambitions. Asked if she would consider jumping into politics, the 32-year-old daughter of US secretary of state Hillary Clinton and former president Bill Clinton said, "I don't know."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X