వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ వరల్డ్ చైనా సుందరి, మన వన్యాకు 7వ స్థానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 China's Wenxia Yu is Miss World 2012
బీజింగ్: మిస్ వరల్డ్ కిరీటాన్ని చైనా ముద్దుగుమ్మ వెన్‌క్సియా యు ఎగరేసుకు పోయింది. చైనాకు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇది రెండోసారి. డాంగ్‌షింగ్ ఫిట్‌నెస్ సెంటర్లో అంగరంగ వైభోగంగా ఈ టైటిల్ ప్రదాన కార్యక్రమం జరిగింది. 23 ఏళ్ల వెన్ ప్రస్తుతం సంగీతాన్ని అభ్యసిస్తోంది. భవిష్యత్తులో సంగీత ఉపాధ్యాయినిగానే స్థిరపడాలనుకుంటోంది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ వేల్స్ సోఫీ మౌల్డ్స్, రెండో రన్నరప్‌గా మిస్ ఆస్ట్రేలియా జెస్సికా కహావతి నిలిచారు.

దీంతో అందాల పోటీల్లో చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. గత సంవత్సరపు విజేత వెనిజులాకు చెందిన ఇవియన్ సర్కోస్ చేతుల మీదుగా మిస్‌వరల్డ్ కిరీటాన్ని వెన్ సియా అందుకుంది. భారతదేశం నుంచి గట్టి పోటీ ఇచ్చిన వన్యా మిశ్రా కేవలం టాప్ 7 వరకు వచ్చినా.. చివర్లో తడబడింది. బీజింగ్‌లోని మిస్ ఇండియా వన్యా మిశ్రా టాప్ 7కు మించి పైకి వెళ్లలేక పోయినా, ఆమెకు 'మిస్ సోషల్ మీడియా', 'బ్యూటీ విత్ ఎ పర్పస్' టైటిళ్లు దక్కడం కొంత ఊరట కలిగించే అంశం.

1981 నాటి 'ఉమ్రావ్ జాన్' చిత్రంలోని 'దిల్ చీజ్ క్యా హై జర.. జాన్ లీజియే' పాటకు సెమీఫైనల్స్‌లో నర్తించడంతో ఆమె టాప్ 7లోకి దూసుకెళ్లింది. ఆమెకు కచ్చితంగా ఈసారి టైటిల్ దక్కుతుందనే అందరూ భావించారు. 2000లో బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రాకు చివరిసారిగా మిస్‌ వరల్డ్ టైటిల్ దక్కింది.

మిస్ వరల్డ్ కిరీటం నీకే దక్కాలని ఎందుకు భావిస్తున్నావని ఫైనల్ రౌండ్‌లో న్యాయ నిర్ణేతలు ప్రశ్నించగా, ఈసారి కిరీటం మంచి మనసున్న మహిళకు దక్కాలని, ఆమె ఎక్కడికెళ్లినా అక్కడి వారు ఆమెను తమ సొంత మనిషిగా భావించాలని, ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో సులభమైన విలువలను కలిగి ఉండాలని, తనను తాను నమ్మాలని, నన్ను నేను నమ్ముతానని ఆమె సమాధానమిచ్చింది.

English summary
Miss China Yu Wenxia won the coveted title of Miss World on August 18, triumphing on home soil in a mining city on the edge of the Gobi desert. The mostly Chinese audience erupted in cheers when it was announced that the home candidate, Yu Wenxia, had been awarded the title.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X