వైయస్ బతికుంటే మంత్రి పదవి వచ్చేది కాదు: సారయ్య

అదేమిటని అడిగితే సమాధానం వచ్చేది కాదన్నారు. వైయస్ బతికి ఉంటే గ్రూపు, కుల రాజకీయాల కారణంగా తాను మంత్రి పదవి చేపట్టక పోయి ఉండే వాడినన్నారు. బిసి సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన శాఖకు రూ.3,116 కోట్లను కేటాయించానని చెప్పారు. బిసి ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని, చేతి వృత్తులు క్రమంగా అంతరించిపోతున్నందున ఇంకా వాటినే నమ్ముకొని జీవితాలను పణంగా పెట్టడంలో అర్థం లేదన్నారు.
తాను వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ గతంలో మంత్రి పదవి దక్కలేదన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిసిలు విద్యకు ప్రాధాన్యమివ్వాలని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ సూచించారు. రజస సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications