ఆంధ్రా రైతులపై కర్నాటక రైతుల దౌర్జన్యం, ఉద్రిక్తత

తుంగభద్ర ఎల్ఎల్‌సి కింద మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోనీ, కోడుమూరు నియోజకవర్గాల ఆయకట్టు ఉంది. ఇందుకోసం 725 క్యూసెక్కుల విడుదల చేయాల్సి ఉండగా 151 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇప్పటి వరకు విడుదలైంది. నీటి మళ్లింపుతో 192 గ్రామాలకు తాగునీరు, 43 వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అయితే గేట్లు మూసి వేసిన విషయం తెలుసుకున్న మన రైతులు అక్కడకు వెళ్లి గేట్లు తెరిచే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.
ఆదివారం రోజు కూడా కర్నాటక రైతులు నీటిని అక్రమంగా తరలించుకున్న విషయం తెలిసిందే. తుంగ భద్ర నుంచి కర్నూలు జిల్లాకు రావాల్సిన అరకొర నీటికి కూడా ఆ రాష్ట్రంలోని మోకా వద్ద కర్ణాటక రైతులు గండికొట్టారు. షట్టర్లు దించేసి నీటి సరఫరా నిలిపేశారు. ఇదేమిటని నిలదీసిన అధికారులపై, రైతులపై తిరగబడ్డారు.












Click it and Unblock the Notifications