హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెన్నా భూములపై సర్కారు వెనక్కి, జగన్ కేసులోనూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భూపందేరాలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గత కొంతకాలంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బయ్యారం గనులను ఒప్పందాలను రద్దు చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన ఓ భూ పందేరంపై కీలక నిర్ణయం తీసుకుంది. వైయస్ హయంలో పెన్నా సిమెంట్‌కు చేసిన లీజుపై సర్కారు వెనక్కి తగ్గింది. తీసుకున్న పేదల పట్టా భూములను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు సదరు కంపెనీకి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తాండూరు మండలం బెల్కటూరు, సంగెం కలాన్‌లో సున్నపురాతి నిక్షేపాలున్న 822 ఎకరాల భూములను.. వాటి పట్టాదారులకు కూడా తెలియకుండానే పెన్నా సిమెంట్ కంపెనీకి గతంలో వైయస్ సర్కార్ లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరి 29న జీవో ఎంఎస్ నెం. 76 ద్వారా ఈ భూములను కంపెనీకి ధారాదత్తం చేసింది. ఇందులో 500 ఎకరాలు బడుగులకు చెందిన పట్టాభూములు ఉన్నాయి.

విలువైన ఈ భూములను పెన్నా సంస్థకు అప్పట్లో ఎకరానికి వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకు ప్రభుత్వం ఇచ్చింది. తమ భూములు తమకు తెలియకుండా పెన్నా సంస్థకు కట్టబెట్టారని రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఈ వ్యవహారం జగన్ అక్రమాస్తుల కేసులతో ముడిపడటంతో సిబిఐ కూడా విచారణ మొదలు పెట్టింది. పట్టాదారులకు తెలియకుండా జరిగిన ఈ భూకేటాయింపుపై రచ్చ రచ్చ కావడంతో ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గాలని తాజాగా నిర్ణయించింది.

ఈ మేరకు పట్టాదారుల నుంచి తీసుకున్న సుమారు 500 ఎకరాల భూములను వెనక్కి ఇవ్వాలంటూ పెన్నా సిమెంట్ కంపెనీకి గనుల శాఖ డైరెక్టరేట్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. పట్టాదారుల అనుమతి లేకుండా సేకరించిన భూములను ఎందుకు వెనక్కి ఇవ్వకూడదో తెలపాలని పెన్నా కంపెనీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై కంపెనీ నుంచి సమాధానం రాగానే చట్టపరంగా ఈ పట్టా భూములను రైతులకు వెనక్కి అప్పగిస్తారు. రైతుల పట్టా భూములు కాకుండా మిగిలిన భూములపై సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

English summary
Government of Andhra Pradesh issued notices to penna cements company about Rangareddy district lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X