తెలంగాణ పక్కలో బల్లెం: టిజి వెంకటేష్, జగన్ కేసుపైనా

ఆఖరుగా ఇప్పుడు ఈ బంతి కాంగ్రెసు కోర్టులోనే ఉందన్నారు. తమ పార్టీ దీనిపై జాప్యం చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తమ పార్టీ తీసుకుంటుందని, అయితే అది త్వరగా ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణకు డార్జిలింగ్ తరహా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టిజి వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఏమాత్రం ఉండదని, అవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టి పారేశారు. కృష్ణా నీటి విడుదల సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నీటి పారుదల శాఖలో కొంత సిబ్బంది కొరత ఉందని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో లబ్ది పొందింది తండ్రి కొడుకులేనని జగన్, వైయస్‌ను ఉద్దేశించి అన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసులో మంత్రులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications