ఐఐటి కాన్పూర్ తెలుగు విద్యార్థి నెహ్రూ ఆత్మహత్య

Vadtya Nehru
హైదరాబాద్: ఐఐటి కాన్పూర్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థి హైదరాబాద్ శివార్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారంనాడు అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువకుడి ఆత్మహత్యకు చదువులో వెనకబాటే కారణమని తెలుస్తోంది. మరో కథనం కూడా వినిపిస్తోంది. సరిగా హాజరు లేకపోవడంతో అతన్ని కళాశాల నుంచి తొలగించారని అంటున్నారు. దీంతో మనస్తాపానికి గురై అతను బలవన్మరణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు.

అతడ్ని వర్తియావత్ నెహ్రూ(20) గుర్తించారు. నల్గొండ జిల్లా పెద్ద అరిశర్లపల్లి మండలం నర్లంగ తండాకు చెందిన వర్తియావత్ నెహ్రా కాన్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే.. తరచూ గైర్హాజరు కావడంతో కళాశాల నుంచి తొలగించారని సమాచారం. అతను ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాదాపు 4 నెలలుగా హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఉంటున్నాడు.

ఇటీవల తల్లిదండ్రులకు తెలియడంతో మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని కల్పతరు రియల్ ఎస్టేట్ వెంచర్ రోడ్డు పక్కన అతని శవం పడి ఉంది. అతని తల్లిదండ్రులు పన్ని, వెంకటరమణ.

ఐఐటి కాన్పూర్‌కు వెళ్తున్నట్లు కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వచ్చేశాడు. అయితే, అతను కాన్పూర్ వెళ్లకుండా హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+