వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాచుకునేందుకే: జగన్‌పై దుమ్మెత్తిపోసిన కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
వరంగల్/ ఖమ్మం: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచిన సొత్తును దాచుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయం చేస్తున్నాడని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నాయకులకు దోచుకున్న ఆస్తుల పంచాయితే తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాలనే ధ్యాసే లేదని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ సదస్సు శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండ లోని ఆర్స్ట్ కళాశాల సెమినార్ హాల్‌లో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదండరామ్ జగన్‌పై దుమ్మెత్తి పోశారు.

గవర్నర్ సోనియా ఇంటిముందు, గుడుల ముందు కన్పిస్తున్నాడే తప్ప రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని విమ ర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాటాల కోసం తిప్పలు పడు తున్నాడనీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా అదేబాటలో ప్రయాణిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సాగడం దుర్లభమన్నారు. సెప్టెంబర్ 30న ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయ డానికి ప్రజలు తండోపతండాలుగా హైద్రబాద్‌కు తరలిరావాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు.

ఈ మార్చ్ సక్సెస్‌ను చూసి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చే విధంగా ప్రజా కదలికలు ఉండాలని ఆయన సూచించారు. పరిషత్ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీహరి నాయక్, ప్రొఫెసర్ వెంకటనారాయణ, ప్రొఫెసర్ సీతారాం నాయక్, న్యూ డెమోక్రసీ నేత గోవర్దన్ పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, వనరుల దోపిడీ విముక్తి కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని తెలంగాణ కోదండరామ్ అన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో బయ్యారంలో శుక్రవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో కోదండరామ్ పాల్గొన్నారు. బయ్యారం ఖనిజం ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడి ఉక్కు తెలంగాణ ప్రజల హక్కుగా బావించి విశాఖకు తరలకుండా కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు.

ముడి ఇనుము తయారీకి అవసరమయ్యే వనరులన్నీ ఈ ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉన్నప్పుడు ఇక్కడి ఖనిజాన్ని విశాఖకు తరలించాల్సిన అవసరమేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నప్పటికీ చలించని సీఎం రబ్బర్ స్టాంపుల వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.

English summary
Telangana political JAC chairman Kodandaram lashed out at YSR Congress president YS Jagan. He said that YS Jagan is playing politics to protect his wealth, which was earned during his father YSR's regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X