హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 కోట్లిచ్చి సర్వే, లాలూచీ కోసమే: జగన్‌పై దేవినేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao - Revanth Reddy
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీటివితో సర్వే చేయించుకున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, రేవంత్ రెడ్డిలు మంగళవారం ఆరోపించారు. ఎన్డీటీవికి రూ.10 కోట్లు ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు అనుకూలంగా సర్వే చేయించిందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు కోసమే ఇదంతా అని మండిపడ్డారు.

కేవలం లోకసభ స్థానాలను మాత్రమే సర్వే చేయించుకొని అసెంబ్లీ స్థానాలను ఎందుకు సర్వే చేయకుండా వదిలేశారని దేవినేని ప్రశ్నించారు. ఇదంతా చేయాలని చేసిందే అన్నారు. కాగా విద్యుత్ కోతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించారు.

వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసుతో కలిసి విద్యుత్ కోతలపై ఆందోళనలు చేపట్టాలని సూచించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుపై వారు మండిపడ్డారు. జగన్ పార్టీని కలుపుకు వెళ్లాలని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని వారు ఆరోపించారు.

అలాంటి పార్టీతో పని చేయాలని రాఘవులు సూచించడం బాధాకరమన్నారు. ముదిగొండలో ఆరుగురు వామపక్ష కార్యకర్తలను వైయస్ ప్రభుత్వం కాల్చి చంపిన ఘటనను ఆయన మరిచిపోయారా అని ప్రశ్నించారు. దివంగత వైయస్ చచ్చి బతికి పోయారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడటం తమ బాధ్యత అని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తాము రాఘవులు కోసం ఆందోళన చేయడం లేదని, ప్రజల కోసం చేస్తున్నామన్నారు.

English summary
Telugudesam Party MLAs Devineni Umamaheswara Rao and Revanth Reddy are said that NDTV survey is fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X