హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి బెయిల్ డీల్‌ సొమ్ముపై రంగంలోకి దిగిన ఈడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. గాలి బెయిల్ కోసం ఆయన సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి అంత పెద్ద మొత్తంలో నగదును ఎలా సమకూర్చారనే విషయంపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒఎంసి, ఎఎంసి కేసుల దర్యాప్తు సందర్భంగా గాలి అక్రమ వ్యాపార లావాదేవీలన్నింటినీ సిబిఐ దాదాపుగా నిలిపేసింది.

గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన ఆదాయ మార్గాలు దాదాపుగా మూసుకుపోయిన తరువాత కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చగలిగారన్నదీ అంతుపట్టకుండా ఉంది. దీనిపై ఈడీ ప్రస్తుతం కూపీ లాగుతోంది. ఈ డీల్‌లో చివరగా చేతులు మారిన రూ.9.5 కోట్లు కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు ఎలా చేరాయి? ఎక్కడి నుంచి సమకూర్చారు? అనే వివరాలను సేకరిస్తున్నారు.

సీబీఐ కోర్టు మాజీ జడ్జి పట్టాభిరామారావు మూడోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తదుపరి వాదనలు 31వ తేదీకి వాయిదా పడ్డాయి. బెయిల్ మంజూరు చేయాలంటూ డిఫెన్స్ ఇప్పటికే వాదనలు వినిపించింది. దీనిపై ఏసీబీ కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.

పట్టాభి రామారావుతో పాటు సోమశేఖర్‌ రెడ్డి, దశరథరామిరెడ్డి, సురేష్‌ బాబు, ఆదిత్య, రౌడీషీటర్ యాదగిరి బెయిల్ పిటిషన్లపై వాదనలు కూడా 31కి వాయిదా పడ్డాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తైన చలపతిరావు, రవిచంద్ర బెయిల్ పిటిషన్లపై వెలువరించాల్సిన తీర్పును జడ్జి ఎస్.జగన్నాధం అదే రోజుకు వాయిదా వేశారు.

English summary
Enforcement Directorate (ED) is investigating about the source money minted for Karnataka former minister Gali Janardhan Reddy bail deal case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X