హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై తేల్చనున్న బాబు: జగన్‌ కన్నా బెటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు సంస్థాగతంగా పట్టులేదని, కొద్దిగా కష్టపడితే పార్టీ బాగా పుంజుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలకు సూచించారు.

శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు సెంటిమెంటు మీద నడుస్తున్నాయని, ఆ పార్టీలకు సంస్థాగతంగా పట్టు లేదని అన్నారు. అదే సమయంలో టిడిపికి మంచి పట్టు ఉందని, దానిని వినియోగించుకుంటే బలం పుంజుకుంటుందని చెప్పారు. పార్టీ చేపడుతున్న ఆందోలన కార్యక్రమాల పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎస్సీ కేటగరైజేషన్ పైన స్పష్టత ఇచ్చిన చంద్రబాబు తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సమావేశంలో బాబు మాట్లాడుతూ.. తెలంగాణపై సెప్టెంబర్ రెండో వారంలోగా పార్టీ తరఫున స్పష్టత ఇస్తామని నేతలకు తెలిపారు. తెలంగాణ విషయంలో ఇతర పార్టీల నేతలు వ్యక్తిగతంగా చేసే ప్రకటనలను తాను పట్టించుకోనని చెప్పారు. రేపటి నుండి అన్ని ప్రాంతాల నేతలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. కాగా సమన్వయ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాలని, తనపై ఆధారపడవద్దని వారికి చంద్రబాబు సూచించారు.

కాగా ఇటీవల చంద్రబాబు పలు అంశాలలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్లుగానో నాన్చుతూ వస్తున్న పలు అంశాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే బాబు నిర్ణయం పెండింగ్‌లో ఉంది. దానిపై కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణకు లేఖ ఇచ్చే పక్షంలో రాయలసీమకు కూడా మద్దతు పలకాలని బాబును డిమాండ్ చేస్తున్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu said in TDLP meeting that he will give clarity on Telangana issue in September second week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X