వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు స్పష్టత లేదు, మీకొండొచ్చు: తెలంగాణపై షిండే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: 'తెలంగాణపై మీ పార్టీకి స్పష్టత ఉండి ఉండొచ్చు. కానీ మా పార్టీకి, ప్రభుత్వానికి స్పష్టత లేదు' అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయతో అన్నారు. తాను ఇటీవలే హోంశాఖ బాధ్యతలు చేపట్టానని, ఇప్పుడే కుదురుకుంటున్నానని, మళ్లీ కలిసినప్పుడు ఈ అంశంపై మాట్లాడదామని హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తనతో అన్నట్టు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో జంతర్‌మంతర్ వద్ద మూడువేల మందితో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యాలయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షిండేతో తన భేటీ వివరాలు తెలియజేశారు. తెలంగాణ ఇస్తే లాభమా? ఇవ్వకుంటే లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని, కాబట్టే ఆ పార్టీకి స్పష్టత లేదని విమర్శించారు. విభజన సమస్య కారణంగా రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని చెప్పారు.

దద్దమ్మ ప్రభుత్వాన్ని నడుపుతూ కిరణ్ నామ్‌కే వాస్తే సీఎంగా మిగిలారని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో తలపెట్టిన పార్టీ ధర్నా వివరాలను ఆయన వెల్లడించారు. తొలిరోజు లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రెండోరోజు సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, ముగింపు రోజున ఎన్డీఏ చైర్మర్ ఎల్‌కే అద్వానీ ధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. అలాగే ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్ సహా పలువురు నాయకులూ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. కరువు, కరెంటు కోతలపై సీఎం కిరణ్..ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, షిండే శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో బస చేస్తారు. అదేరోజు రాత్రి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసానికి వెళ్తారు. తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం తర్వాత శ్రీకాళహస్తి చేరుకుంటారు.

English summary
Union Home Minister Sushil Kumar Shinde said with BJP leader Bandaru Dattatreya that his Congress and government party is not having clarity. Bandaru Dattatreya lashed out at CM Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X