వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిలిప్పైన్స్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Philippines map
మనీలా: పిలిప్పైన్స్‌ను శుక్రవారం భారీ భూకంపం తాకింది. ఇది రెక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. ఈ ప్రాంతంలో అమెరికా జియోలాజికల్ సర్వే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేశాయి. సమార్ ప్రొవిన్స్‌లోని గుయాన్‌కు 146 కిలోమీటర్ల దూరంలో తూర్పు దిశగా కేంద్రీకృతమైంది.

దాదాపు 32 కిలోమీటర్ల లోతు కేంద్రంగా భూకంపం చోటు చేసుకుంది.పిలిప్పైన్స్ జపాన్, ఇండోనేషియా, తైవాన్, పాపువా, న్యూ గయానా, ఇతర దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం విధ్వంసకరమైన సునామీకి దారి తీసే ప్రమాదం ఉందని, భూకంపం కేంద్రీకృతమైన కోస్తా తీరాలను, దూరంలోని కోస్తా తీరాలను సునామీ తాకవచ్చునని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం - రాత్రి 8. 50 గంటల ప్రాంతంలో వచ్చింది. ఈ భూకంపం అత్యంత తీవ్రమైందని, హోటల్ అతిథులు భయాందోళనలకు గురవుతున్నారని సంబంధిత వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, భూకంప తీవ్ర ఎంత ఉందో పరిశీలిస్తున్నామని చెబుతున్నాయి. నష్టానికి గానీ గాయాలకు గానీ సంబంధించిన సమాచారం అందలేదు.

ఆ తర్వాత జపాన్, తైవాన్‌లకు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు దేశాలు ఊరట పొందాయి. సునామీ అలలు హవాయిలోని అమెరికా తీరాన్ని తాకవచ్చునని అంటున్నారు. సమార్ దీవి తూర్పు తీరంలోని ప్రజలు తరలిపోవడం మంచిదని పిలిప్పైన్స్ సీస్మోలజీ హెడ్ రెనాటో సోలిడుమ్ చెప్పారు.

English summary
An earthquake of 7.9 magnitude struck off the Philippines on Friday and a tsunami warning has been issued for the region, the U.S. Geological Survey and the Pacific Tsunami Warning Center said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X