విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్లపై టిడిపి నేతలు, కార్యకర్తలు: దేవినేని ఉమ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
విజయవాడ: కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాలుగు జిల్లాల్లో రోడ్లను దిగ్బంధం చేశారు. రోడ్లకు అడ్డంగా బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, రైతు సంఘాలు ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టాయి. కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై తెలుగుదేసశం నాయకులు, రైతులు రాస్తారోకోకు దిగారు. దాదాపు అరగంట పాటు రాస్తారోకో జరిగింది.

తెలుగుదేశం శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు సహా పార్టీ కార్యకర్తలను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డెల్టా పరిరక్షణ పేర గతంలో ఆందోళనలు చేసిన కాంగ్రెసు నాయకులు ఇప్పుడేమయ్యారని ఆయన అడిగారు.

గుంటూరు జిల్లా పెద్దకాకాని వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రహదారిపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు పెట్టారు. దాంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమయంలో పోలీసులకు, తెలుగుదేశం నాయకులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోలీసులు, తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసి పెదకాకాని పోలీసు స్టేషన్‌‌కు తరలించారు.

డెల్టా కింది 13 లక్షల ఎకరాల పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు సాగు నీటి కోసం తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం గుంటూరు జిల్లా నాయకుడు కోడెల శివప్రసాద రావు మండిపడ్డారు. తమ ఉద్యమాన్ని అపేది లేదని ఆయన చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడం తగదని రాయలసీమ నాయకులు చేస్తున్న వాదనను దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు పట్టారు. కృష్ణా జిల్లా కాంగ్రెసు నాయకుల చేతగాని తనం వల్లనే రాయలసీమ నాయకులు ఆ విధమైన వాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Telugudesam party has organised rastra roko in four districts of Coastal Andhra demanding release of Krishna water to delta. TDP leader Devineni Umamaheswara Rao during rastra roko.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X