హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను ఎన్నారై భర్త అరెస్టు, కట్నం వేధింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధించిన ఓ ఎన్నారై భర్తను హైదరాబాదులోని బేగంపేట మహిళా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి సీతాఫల్‌మండిలోని అతని నివాసంలో శుక్రావరం అరెస్టు చేశారు. అదనపు కట్న కోసం వేధించడమే కాకుండా భార్యను ఆస్ట్రేలియాలో ఒంటరిగా వదిలేసి వచ్చాడు. సంతోష్ రాజ్ అనే అనే 32 ఏళ్ల ఎన్నారై దీంతో కటకటాల వెనక్కి వెళ్లాడు.

వివరాల్లోకి వెళ్తే - విశాఖపట్నానికి చెందిన రామారావు, సుజాతలు తమ కూతురు సంతోషి సుజన (24)ను సికింద్రాబాదులోని సీతాఫల్‌మండికి చెందిన సంతోష్ రాజ్‌కు ఇచ్చి 2008లో వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా 15 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, మరో లక్ష రూపాయల విలువ చేసే గృహోపకరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే కొంత కాలానికే మరో ఐదు లక్షలు తీసుకురావాలని సంతోష్ రాజ్ భార్యను వేధించడం ప్రారంభించాడు.

ఆ స్థితిలోనే అతను 2009లో ఒంటరిగా అమెరికా వెళ్లిపోయాడు. కొద్ది కాలానికి సంతోషి సుజన కూడా అమెరికా వెళ్లింది. వీరిద్దరు తిరిగి నగరానికి వచ్చారు. అయినా అతను వేధింపులు మానలేదు. 2011లో భార్యాభర్తలు అస్ట్రేలియా వెళ్లారు. అక్కడ కూడా సంతోషిని అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అడిగిన డబ్బు తీసుకుని రాలేదని ఆమెను ఆస్ట్రేలియాలోనే వదిలేసి ఇక్కడికి వచ్చేశాడు.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితురాలు అక్కడి నుంచి తల్లిదండ్రులను సంప్రదించి ఆగస్టు 12వ తేదీన నగరానికి వచ్చింది. అత్తింటివారి వద్దకు వెళ్లగా భర్తతో పాటు అత్త ఇంట్లోకి రావద్దంటూ ఆమెకు చెందిన వస్తువులను బయటకు విసిరేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు బేగంపేట మహిళా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
A day after a dowry harassment case was registered against an NRI, the Begumpet women police on Friday arrested the man from his residence in Seetaphalmandi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X