మంత్రినై ఉండి సిఎంని అడుక్కోవాల్సొస్తుంది: డిఎల్

సాక్ష్యాత్తూ మంత్రిని అయిన తనకే విద్యుత్ సరిగా లేదని, సిఎంను అడుక్కోవాల్సి వస్తోందని అన్నారు. తనకూ పవర్ కట్ తప్పడం లేదన్నారు. సంక్షేమ పథకాలు పకడ్బంధీగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఉచిత పథకాలు అని చెప్పే రాజకీయ నాయకులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి తన నియోజకవర్గం మైదుకూరులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఒక్కరూపాయి బియ్యం పథకాన్ని డిఎల్ వ్యతిరేకించారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య పొసగడం లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ మార్పులు చేర్పులలో డిఎల్ వద్ద ఉన్న రెండు శాఖలలో ఓ శాఖకు కిరణ్ కోత పెట్టారు. అప్పటి నుండి డిఎల్ మరింత అగ్గిమీదద గుగ్గిలం అవుతున్నారు. ఓ సమయంలో అతను రాజీనామాకు సిద్ధపడ్డారు.
అయితే పిసిసి చీఫ్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులతో చర్చించిన అనంతరం డిఎల్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. అయితే సమయం చిక్కినప్పుడుల్లా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం మాత్రం ఆపలేదు. ఢిల్లీకి వెళ్లి కిరణ్ పైన ఫిర్యాదులు కూడా చేశారు. అయితే కొంతకాలంగా డిఎల్ సైలంట్ అయ్యారు.












Click it and Unblock the Notifications