జగన్ పిల్లాడుకాదు, సోనియాపై కేసుపెట్టాలి: నారాయణ

కేంద్రమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసి చీటర్‌గా మారినందువల్లే 800 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఏకాభిప్రాయం లేదంటున్న చిదంబరం, ఆయన భార్య న్యాయవాదులుగా ఒకే కేసులో చెరో వైపున వాదించి రూ.కోట్లు కూడబెట్టారన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు తన క్షమాపణ కోరుతున్నారని, లేకపోతే హక్కుల ఉల్లంఘన కింద జైలుకు పంపుతామంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం అవసరమైతే 20 ఏళ్లయి నా జైల్లో ఉండటానికి సిద్ధమేనని, వాళ్లు ఒక్కరోజయినా ఉండగలరా? అని సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ప్రజలకు క్షమాపణ చెబితే తానూ ఆ పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజూ ఉదయం తన కుర్చీ నట్లు బిగించుకుంటారని, సాయంత్రానికి అవి ఊడిపోతుంటాయని ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని 2004లో తెరాసతో పొత్తు పెట్టుకుని మోసం చేసింది కాంగ్రెస్ అన్నారు.
2009లో టిడిపి కూడా తెరాసతో కలసి మహాకూటమిగా ఏర్పడినపుడు మాట ఇచ్చినా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దానికి కట్టుబడలేదన్నారు. ఇక తమది ఇప్పుడే పుట్టిన పిల్లాడిలాంటి పార్టీ అని, తెలంగాణపై ఏం చెప్పగలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడని, రూ.60 వేల కోట్లు దోచుకుని, 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఆయన చిన్న పిల్లవాడెలా అవుతాడని నిలదీశారు. సోనియాను చూడగానే చెమటలతో బట్టలు తడుపుకునే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications