జగన్ లేకపోవడం బాధే: ఇడ్పులపాయలో వైఎస్ వివేకా

వైయస్‌కు నివాళులు అర్పించేందుకు జగన్‌కు అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు. గత ఏడాది తమతో గడిపిన జగన్ ఈసారి లేకపోవడం తనను వ్యక్తిగతంగా కలచి వేస్తోందన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను జైలులో పెట్టించారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. జగన్‌తోనే రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పడం చేతకానితనానికి నిదర్శనమన్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియాజకవర్గంలో వైయస్సార్ వర్థంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి నియాజక వర్గంలో 150 వైయస్ విగ్రహలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి విగ్రహన్ని టిడిపి కంచుకోటగా ఉన్న చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మహిళలు సొంతంగా నిధులు సమీకరించి ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి మరీ వైఎస్ విగ్రహన్ని ప్రతిష్టించడం విశేషం.












Click it and Unblock the Notifications