బెంగళూర్లో మళ్లీ కలకలం: పారిపోతున్న ఉగ్రవాది అరెస్ట్

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఓ విదేశీ పిస్తోలును, 32 తుటాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉగ్రవాదుల అరెస్టు 17కు చేరుకుంది. ముంబయికి చెందిన మహ్మద్ అక్రమ్ రెండేళ్లుగా బసవేశ్వర నగర్‌లో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలలో భారీగా కుట్రకు ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇతను ఇంతకుముందు ఏడాది పాటు దుబాయ్‌లో ఉన్నాడు. రెండేళ్లుగా బెంగళూరులో ఉంటున్నప్పటికీ ఇటీవలె దుబాయ్ మరోమారు వెళ్లొచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అక్రమ్ అరెస్టును ప్రకటించారు. అరెస్టైన వారి నుండి సేకరించిన వివరాల ప్రకారం మరో నలుగురిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాదు ఇప్పటికే ఓ టీం బయలుదేరింది. ముంబయిలోనూ ఒకరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం.
దొరికిన వారందరికీ లష్కర తోయిబా, హుజి సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుండి ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనే చేసుకున్నారు. పోలీసులు గుట్టు చప్పుటు కాకుండా సక్సెస్ ఫుల్‌గా ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారు. ఉగ్రవాదులు కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్న నేపథ్యంలో టెక్నికల్ గ్రూప్ కూడా రంగంలోకి దిగింది.












Click it and Unblock the Notifications