మూడోవాడు మోడీ: నెటిజన్లతో సంభాషించిన మన నేత

స్వామి వివేకానంద నిర్మించిన ఉజ్వలమైన భారతదేశం అనే అంశంపై గూగుల్ ప్లస్ తమ వెబ్‌సైట్లో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం ఉదయం నరేంద్ర మోడీ నెటిజన్లతో సంభాషించారు. దాదాపు ఇరవై వేల మంది నెటిజన్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొనగా.. మోడీ దాదాపు 6500 ప్రశ్నలకు ఎటువంటి విసుగు లేకుండా జవాబిచ్చారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హోస్ట్‌గా వ్యవహరించారు.
మోడీ ఫేస్‌బుక్, యుట్యూబ్, ట్విట్టర్‌లు మరియు తన స్వంత వెబ్ సైట్ తదితరాల ద్వారా వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చాలామంది గుజరాత్ అభివృద్ధి పైన ప్రశ్నలు సంధించారు. అలాగే మోడీ విజన్ పైన కూడా వారు ప్రశ్నలు వేశారు. కాగా నరేంద్ర మోడీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు.












Click it and Unblock the Notifications