కృష్ణా నీటి కోసం మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ దీక్ష

ద్వేషం, అయిష్టత గాలిలో వ్యాప్తిచేస్తున్న వారి హృదయాల్లో పరివర్తన రావాలని, కృష్ణాడెల్టా వాస్తవ పరిస్థితులను వారే గమనించాలని కోరుతూ గాంధీజీ సూచించిన 'వ్యక్తి సత్యాగ్రహం' చేస్తున్నట్లు ఆయన ప్రకటించి వెంటనే దీక్షలో కూర్చున్నారు.రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని ప్రమాణంచేసిన మంత్రులు, దేశ ప్రయోజనాలు కాపాడుతామని ప్రమాణంచేసిన ఎంపీలు డెల్టా గురించి తెలియకుండానే అర్ధంలేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
డెల్టాకు నీటి విడుదలపై అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రాంతీయ భేదాలతో మాట్లాడడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. చేపల చెరువులకు నీటిని వదులుతున్నారంటూ రాయలసీమ ఎంపి ఎస్పీ.వై.రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవంటూ, ఆయన డెల్టా ప్రాంతాన్ని ఏనాడైనా ఆయన చూశారా? అని ప్రశ్నించారు.
దురుద్దేశాలను వ్యాప్తిచేస్తూ, డెల్టా ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్న వారు డెల్టాలోని దుర్భిక్ష పరిస్థితులను గమనించాలని మండలి కోరారు. తన సత్యా గ్రహ దీక్షకు రాజకీయ కోణంతో చూడరాదని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications