హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెఏ పాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

KA Paul
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్ పాల్(కెఏ పాల్)కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో అరెస్టైన పాల్‌కు కోర్టు రూ.లక్ష పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పాసుపోర్టును పోలీసులకు అప్పగించాలని, ప్రతివారం పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు పాల్‌ను ఆదేశించింది.

కాగా తమ్ముడు డేవిడ్ రాజు హత్య జరిగి రెండేళ్లయిన తర్వాత పాల్ ఇటీవల పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన పోలీసులకు ఎలా సాక్ష్యాలు దొరికాయనేది ఆసక్తికరంగా మరింది. డేవిడ్ రాజు హత్య కేసులో కెఎ పాల్ సుపారీ ఇచ్చినట్లు పోలీసులు అనుమానించారు. ఉప ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లాలోని పత్తిపాడు, మాచర్ల శానససభా నియోజకవర్గాలకు ఆయన సోమవారం అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది.

ఇందుకు గుంటూరులో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ స్థితిలో ఆయన పోలీసులకు చిక్కారు. అతనిని అరెస్టు చేసిన పోలీసులు పోలీసు స్టేషన్‌కి తరలించారు. పోలీసులు కోర్టు అనుమతితో పాల్‌ను తమ కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు. పాల్‌ను పోలీసులు మే మూడో వారంలో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అరెస్టు చేశారు.

డేవిడ్ రాజ్ రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పాల్ పోలీసు స్టేషన్‌లో కూడా చిత్రంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

English summary
Prajasanthi Party chief, well known christian preacher Kilari Anand Paul get conditional bail from High Court on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X