హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు వాసిరెడ్డి కౌంటర్: వైయస్‌కు శంకరన్న కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vasireddy Padma-Shankar Rao
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధర్నా చేయడం సంతోషకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం అన్నారు. వైయస్ పథకాలకు ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు బహిరంగంగా ఒప్పుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. బాబుకు విద్యార్థుల చదువుపై చిత్తశుద్ధి ఉంటే టిడిపి మేనిఫెస్టోలో ఫీజు రీయింబర్సుమెంట్సు పథకం ఎందుకు లేదో చెప్పాలన్నారు.

చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు పేదల గురించి ఆలోచించలేదన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సుపై ఇప్పుడు ధర్నా చేస్తున్న బాబు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రీయింబర్సుమెంట్సు పథకం వైయస్ రాజశేఖర రెడ్డి కల అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక దానిని అమలు పర్చారని, బాబుకు మాటల్లో ఉన్న ఆందోళన చేతల్లో ఉండదని ఎద్దేవా వాసిరెడ్డి పద్మ చేశారు.

విద్యుత్ సంక్షోభంపై మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గదేనని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఘనత దివంగత వైయస్‌దేనని మాజీ మంత్రి శంకర రావు వేరుగా అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలో కోట్లాది మందికి మేలు జరిగిందన్నారు.

జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోరాదని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని శంకర రావు సూచించారు. పేదల ఆరోగ్యం దృష్ట్యా జూనియర్ డాక్టర్లు కూడా సమ్మెను విరమించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ భయపడవలసిన అవసరం లేదన్నారు. పార్టీ గుర్తు లేకుండా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని, గెలిచిన వారిని పార్టీలోకి తీసుకోవచ్చునని అన్నారు.

English summary
YSR Congress party spokes person Vasireddy Padma said it is very happy to say that TDP chief Nara Chandrababu Naidu is make agitation for late YSR schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X