చిదంబరం భార్య, కొడుకుపై భూకబ్జా ఫిర్యాదు: వివరణ

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని జాలర్లకు ఇవ్వాలని నిర్ణయించిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భూమిని చిదంబరం సతీమణి నళిని, ఆయన తనయుడు కార్తీ చిదంబరం, బంధువులు కలిసి తప్పుడు దస్తావేజులతో కబ్జా చేశారని ఆరోపిస్తూ పలువురు జాలర్లు ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన స్థలాన్ని వారు ఆక్రమించుకోవడంతో సముద్రంలోకి వెళ్లడానికి, వలలు ఆరబెట్టడానికి ఇబ్బందిగా ఉందని దక్షిణ భారత జాలరి సంఘం అధ్యక్షుడు పాలయ్యన్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న చిదంబరం సతీమణి నళిని తరఫు న్యాయవాది స్పందించారు. చిదంబరం కుటుంబ సభ్యులు ఎలాంటి స్థలాన్ని స్వాధీనపర్చుకోలేదని చెప్పారు. నళిని న్యాయవాది అరుణ్ నటరాజ్ కమిషనర్‌కు వివరణ పత్రం కూడా అందించారు. అది ఆక్రమణ స్థలం కాదని, ఇరవై ఏళ్లుగా తమ పర్యవేక్షణలోనే ఉందని చెప్పారు. కాగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications