వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎంవో స్పందన-మొండికేసిన వాషింగ్టన్ పోస్టు డైలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
వాషింగ్టన్: భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని తప్పు పడుతూ వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన వార్తాకథనం తీవ్ర దుమారం రేపుతోంది. తాము ఆ వార్తాకథనానికి కట్టుబడి ఉన్నామని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని వాషింగ్టన్ పోస్టు కరస్పాండెంట్ అన్నారు. అమెరికా దినపత్రిక వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన వార్తాకథనంపై ప్రధాని కార్యాలయం స్పందించంది. వార్తకథనం రాసిన జర్నలిస్టు సిమోనే డెన్యర్‌ను నిలదీసింది. వాషింగ్టన్ పోస్టు పత్రిక గానీ, ఆ పత్రిక ప్రతినిధి గానీ తమను సంప్రదించలేదని, ఏకపక్షంగా వార్తాకథనం రాశారని విమర్సించింది.

ఆ అంశంపై పత్రిక క్షమాపణ చెప్పడానికి నిరాకరించిందని, రిపోర్టరు మాత్రం రెంెడు సార్లు క్షమాపణ చెప్పాడని ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయం తెలిపింది. అయితే, తాను రాసిన వార్తాకథనానికి కట్టుబడి ఉన్నానని వాషింగ్టన్ పోస్టు ఇండియా బ్యూరో చీఫ్, వార్తాకథనం రచయిత సిమోనే డెన్యూర్ అన్నారు. ప్రధాని కార్యాలయం కమ్యూనికేషన్స్ సలహాదారు పంకజ్ పచౌరి చేసిన ఫిర్యాదుకు ఆయన జవాబు ఇచ్చారు.

వెబ్‌సైట్ డౌన్ అయినందుకు మాత్రమే తాను క్షమాపణ చెప్పానని, ప్రధాని కార్యాలయానికి నేరుగా జవాబును పంపించలేకపోయిందని, సమస్య పరిష్కారం కాగానే జవాబును వారికి విషయం చెప్పానని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ జర్నలిస్టుకు ఉందని, దాని గురించి తాము అభ్యంతరం చెప్పడం లేదని, అనైతికమైన, వృత్తిపరమైన ప్రవర్తన లోపాన్ని ఎత్తు చూపుతూ మాత్రమే ఈ లేఖ రాస్తున్నామని పచౌరి డెన్యూర్‌కు రాసిన లేఖలో అన్నారు.

తమతో మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ డెన్యూర్ తమన సంప్రదించలేదని, అందువల్ల వార్తాకథనం ఏకపక్షంగా ఉందని ఆయన అన్నారు. వర్షాకాలం సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. మీరు రెండు సార్లు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత నేను చెప్పలేదని అంటున్నారని పచౌరీ అన్నారు.

English summary
As a Washington Post article on the allegedly poor leadership of Prime Minister Manmohan Singh created a strong reaction in Delhi, the influential US daily's correspondent said he stood by the story and offered no apology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X