హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీనంపై విజయమ్మ మనససులో ఏముందో: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో విలీనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మనసులో ఏముందో తనకు తెలియదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వైయస్ పాదయాత్ర డైరీ విడుదలను ఆయన సమర్థించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో డైరీ రాశారా, లేదా అనేది ముఖ్యం కాదని, ఆ డైరీలో రాజశేఖర రెడ్డి అనుభవాలున్నాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి డైరీ ఆవిష్కరణ రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి చేసింది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇచ్చే సమయంలో కూడా చంద్రబాబు యూ టర్న్ తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణపై కసరత్త జరుగుతున్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. సున్నితమైన అంశాలపై అందరితో చర్చిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు గత మూడు నెలలుగా మాట్లాడుతున్న మాటలను పరిశీలిస్తే పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని, చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పునాదులు పెకలిస్తామని చెప్పినవారు తిరిగి పార్టీలోకి వచ్చారని ఆయన అన్నారు.

కాంగ్రెసు శిథిలం కాలేదు, బీటలు వారలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండో స్థానం ఎవరిదో మరోసారి చెబుతానని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించాలనే హైకోర్టు తీర్పుపై అపీల్‌కు వెళ్తామని ఆయన చెప్పారు. జనాభా లెక్కలు సేకరించడం ఇప్పుడు సాధ్యం కాదని ఆయన అన్నారు. బిసీ రిజర్వేషన్లను తగ్గించబోమని ఆయన అన్నారు.

English summary
PCC president Botsa Satyanarayana said that he doesn't know the intention of YSR Congress party honorary president YS Vijayamma on merger talk. He refuted Telugudesam president Chandrababu Naidu's comments on Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X