సిబిఐ ఏంసాధించింది: గాలి, జగన్‌కూ రిమాండ్ ఎక్స్టెండ్

ఈ సందర్భంగా గాలి మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన వాళ్లను అన్యాయంగా జైలులో ఇరికించారని ఆరోపించారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశమని, తాను మంత్రిగా కూడా పని చేశానని, అలాంటి తనకే న్యాయం జరగనప్పుడు సాధారణ వ్యక్తికి ఎలా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఓఎంసిపై సిబిఐ కేసు నమోదు చేసి మూడేళ్లైనా ఇప్పటి వరకు ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి సంవత్సరం అవుతుందన్నారు.
అయినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ సాధించిందేమీ లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మంత్రిగా పని చేసిన తనకు ఇలాంటి దుస్థితి రావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ట్రయల్ త్వరగా ప్రారంభించి తనకు న్యాయం చేయాలని గాలి న్యాయమూర్తిని కోరారు. గాలి విజ్ఞప్తిని విన్న న్యాయమూర్తి.. ఈ విషయాలను మెమో ఫైల్ చేయించాలని గాలికి సూచించారు. కాగా ఓఎంసి కేసులో గాలి రెండో నిందితుడు.
వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించిన కోర్టు అతనికి ఈ నెల 25వ తేది వరకు రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, శ్రీనివాస్ రెడ్డిలకు, ఎమ్మార్ కేసు నిందితులు విజయ రాఘవ, సునీల్ రెడ్డిలకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలకు కూడా కోర్టు ఈ నెల 25వరకు రిమాండును పొడిగించింది.












Click it and Unblock the Notifications