జగన్‌కు రాజకీయ పలుకుబడి: సుప్రీంకోర్టులో సిబిఐ

దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జగన్‌కు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కొద్దిరోజుల ఆదేశించింది. దీంతో సోమవారం సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వైయస్ జగన్ ఆస్తులపై ఆయన సంస్థలలో పెట్టుబడులు పెట్టిన కేసుకు సంబంధించి ఇంకా దర్యాఫ్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా సిబిఐ పేర్కొంది. దర్యాఫ్తు కొనసాగుతున్న సమయంలో జగన్‌కు బెయిల్ ఇస్తే ఆయనకు ఉన్న రాజకీయ పలుకుబడి తదితరాలు ఉపయోగించుకొని సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది.
కాబట్టి జగన్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని సుప్రీం కోర్టును సిబిఐ కోరింది. సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయటంతో కోర్టు బెయిల్ పిటిషన్ పైన తదుపరి విచారణను ఈ నెల 14వ తేదికి వాయిదా వేసింది. కాగా ఇటీవల హైకోర్టు జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications