కడుపు మండినవాడు నక్సల్ లాగే కనిపిస్తాడు: కెకె

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణ విషయంలో ఎవరికీ భయపడేది లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. కడుపు మండిన ప్రతి ఒక్కడూ నక్సలైట్ లాగే కనిపిస్తాడని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజా సంఘాలు నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన మంగళవారం మాట్లాడారు. దాదాపు అన్ని పార్టీల తెలంగాణ నాయకులు ఒకే వేదిక మీదికి వచ్చారు. 86 శాతం మంది తెలంగాణను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

తెలంగాణ ఇవ్వాలని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ఇప్పుడు ఓటర్లను కోరుదామని ఆయన అన్నారు. పార్లమెంటు ద్వారా, రాజకీయాల ద్వారా తెలంగాణ రానప్పుడు ప్రజల వైపు చూడక తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జరిగేది రాజకీయ ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమమని ఆయన అన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ ఇవ్వగానే తెలంగాణ వస్తుందని అనుకోకూడదని, ఉద్యమం చేయాల్సిందేనని ఆయన అన్నారు.

తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్ని పార్టీలు ఏకమై పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యతను కేశవరావు తీసుకోవాలని ఆయన సూచించారు. సుశీల్ కుమార్ షిండే మాటలు మరోసారి మోసం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు.

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సీమాంధ్ర నేతగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. షిండే తెలంగాణ గురించి తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. చిన్న రాష్టాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి పోరాడాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నేత బండారు దత్తాత్రేయ, తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+