విభజనకు సై, ఒత్తిడి తేవాలి: సీమాంధ్ర టిడిపి నేత దాడి

ఈ సందర్భంగా దాడి మాట్లాడుతూ తెలంగాణపై 2008వ సంవత్సరంలో తాము ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కేంద్రానికి మళ్లీ లేఖ ఇచ్చే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజులు సరిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. మరో ఐదు రోజులు పెంచాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దాడి డిమాండ్ చేశారు.
తెలంగాణపై తమ పార్ట వైఖరి మారితే మళ్లీ లేఖ అడగటంలో అర్థం ఉంటుందని, కానీ తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒకవేళ ఇప్పుడు లేఖ ఇచ్చినా మళ్లీ అడగరని గ్యారెంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణపై అన్ని పార్టీలు కలిసి అధికార కాంగ్రెసు పార్టీపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. తమ పార్టీ కూడా తెలంగాణపై ప్రత్యేక క్లారిటీతో ఉందని దాడి వీరభద్ర రావు చెప్పారు.
అందరూ ఏకత్రాటి పైకి రావాలి.. దత్తాత్రేయ
తెలంగాణ కోసం అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఏకతాటి పైకి రావాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయ ఇందిరాపార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ కోసం ఎవరికి వారు ఉద్యమాలు చేస్తే ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నీ తెలిసి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రం ఎంఐఎంను పావుగా వినియోగించుకుంటుందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications