వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రాహుల్‌గాంధీపై రేప్ కేసు వెనుక అఖిలేష్ యాదవ్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi - Akhilesh Yadav
న్యూఢిల్లీ: ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సూచనల మేరకే తాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పైన రేప్ కేసు పెట్టినట్లు మాజీ సమాజ్‌వాది పార్టీ శాసనసభ్యుడు కిషోర్ సమృతే సోమవారం సుప్రీం కోర్టులో తెలిపారు. 2011లో రాహుల్ గాంధీ పైన నమోదైన కేసు అఖిలేష్ సూచనల మేరకే అని సమృతే తరఫు న్యాయవాది కామిని జైశ్వాల్ సుప్రీం కోర్టులో తెలియజేశారు.

రాహుల్ గాంధీ ఓ బాలికను అక్రమంగా నిర్భంధించారంటూ కిషోర్ సమృతే కేసు పెట్టారు. సమృతే ఫిర్యాదును విచారించిన అలహాబాద్ హైకోర్టు అతనికి రూ.50 లక్షల రూపాయల జరిమానాను విధించడంతో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కిషోర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో గత ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.

సోమవారం దీనిపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సమృతే లాయర్ జైశ్వాల్ తన వాదనలు వినిపిస్తూ... రాహుల్ పైన హైకోర్టుకు వెళ్లాలని పందారా రోడ్డు నుండి సూచనలు అందాయని చెప్పారు. పందారా రోడ్డు పై పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వాలని విచారణ జరుపుతున్న జస్టిస్ స్వతంత్ర కుమార్ లాయర్‌ను అడగటంతో అందుకు జైశ్వాల్ అతను ప్రస్తుత ముఖ్యమంత్రి అని పార్టీ నాయకుడు అని చెప్పారు.

సమృతే పందారా రోడ్డు నుండి అందిన సూచనల మేరకే అతను రాహుల్ పైన హైకోర్టుకు వెళ్లారన్నారు. ఇందుకు న్యాయమూర్తి సదరు వ్యక్తి ఎవరో తెలియదా అని ప్రశ్నించగా.. ప్రస్తుత సిఎం, పార్టీ నేత అని తాము సిబిఐకి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చామని జైశ్వాల్ చెప్పారు. జైశ్వాల్ చెప్పింది యుపి సిఎం ముఖ్యమంత్రి పేరేనని అంటున్నారు.

English summary
A lawyer on Monday told the Supreme Court that a 2011 rape and wrongful confinement case against Congress leader Rahul Gandhi in Allahabad High Court was filed at the instance of Akhilesh Yadav, the current Uttar Pradesh Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X