వైయస్ జగన్ కేసులో లాయర్లను మార్చేసిన ప్రభుత్వం

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ కేసులో ఇప్పటివరకూ వాదిస్తున్న న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. జగన్ కేసులను లోతుగా విచారిస్తున్న సిబిఐ వద్దంటున్నా కేంద్రం వినిపించుకోలేదు. జగన్ కేసును వాదిస్తున్న అశోక్ భాన్ స్థానంలో మోహన్ జైన్‌ను కేంద్రం నియమించింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్‌ను న్యాయ శాఖ పక్కన పెట్టింది.

వైయస్ జగన్ కొన్నాళ్లుగా బెయిల్‌కోసం విఫలయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టుకు అప్పీలు చేశారు. ఈ కేసు శుక్రవారంనాడు విచారణకు రానున్నది. జగన్‌కు ఇప్పటివరకూ హైకోర్టులో చుక్కెదురు అవుతూ వస్తోంది.

జగన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావంటూ జగన్‌కు ఈ దశలో బెయిల్ ఇచ్చినట్టయితే సాక్షులను బెదరించే ప్రమాదం ఉందని సిబిఐ వాదిస్తూ వస్తోంది. విదేశాలనుంచి హవాలా మార్గంలో డబ్బు దేశంలోకి ప్రవాహంలా పారిందని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలనూ సేకరిస్తున్నామని సిబిఐ చెబుతోంది.

ఈ దశలో న్యాయవాదులను మార్చడం ఏం పద్ధతి అని హైదరాబాద్‌లో గురువారంనాడు తెలుగుదేశం నాయకులు కేంద్రం నిర్ణయంపై నిప్పులు చెరిగారు. కేవలం జగన్‌ను బయటకు తీసుకువచ్చే ఉద్దేశంతోనే న్యాయ శాఖ మంత్రి, తదితరులు కుమ్మక్కై ఈ పరిణామానికి శ్రీకారం చుట్టారని వారు ఆరోపించారు.

యనమల రామకృష్ణుడు మరో అడుగు ముందుకు వేసి జగన్ ప్రధానిని కలుసుకున్నప్పుడు కీలకమైన అంశాలపై ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అందులో ఒకటి జగన్‌ను కేసులనుంచి బయటపడే మార్గాన్ని సుగమం చేయడం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై ఎదురు కేసులు పెట్టించడమూనని ఆరోపించారు. కాని ఈ ఆరోపణలను ఢిల్లీ నాయకులు కొట్టేస్తున్నారు. న్యాయవాదుల మార్పు పెద్ద విషయం కాదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+