జగన్‌ను సిఎం చేస్తాం, వదంతులే: కొండా సురేఖ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమని ఆమె చెప్పారు. తాను పార్టీకి దూరంగా ఉండడం లేదని ఆమె స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల వల్లనే తాను పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్షకు తాను హాజరు కాలేదని ఆమె చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయని ఆమె అన్నారు.
తనపై కొన్ని టీవీ చానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తనకు తగిన గుర్తింపు ఉందని ఆమె అన్నారు. వైయస్ విజయమ్మ హైదరాబాదులో చేపట్టిన ఫీజు పోరు దీక్షకు సురేఖ హాజరు కాలేదు. దీంతో ఆమెకు పార్టీకి దూరమవుతున్నారంటూ వార్తలు వచ్చాయి.
పాదయాత్ర చేస్తే వైయస్ రాజశేఖర రెడ్డికి మాదిరిగా పేరు, ప్రఖ్యాతులు వస్తాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భ్రమపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గుర్నాథ రెడ్డి అనంతపురంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిన చంద్రబాబును ప్రజలు నమ్మరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విశ్వేశ్వర రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications