జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా

యితే ఇదే సమయంలో సీబీఐ తరఫున గతంలో వాదించిన న్యాయవాదులను ప్రభుత్వం మార్చి మోహన్ జైన్‌ను నియమించింది. కాగా, న్యాయవాదులను మార్చిన నేపథ్యంలో వాదనలు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి పరిశీలించేందుకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ శుక్రవారం మొదటి సారిగా కోర్టు వచ్చారు.
వైయస్ జగన్ మే 27వ తేదీన అరెస్టయ్యారు. గతంలో ఆయన పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే కొన్ని చార్జిషీట్లను దాఖలు చేసింది. మరిన్ని చార్జిషీట్లను దాఖలు చేసేందుకు సిద్ధపడుతోంది.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు ఇంకా జైలులోనే ఉన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అంటూ సిబిఐ జగన్‌కు బెయిల్ ఇవ్వరాదని కోరుతోంది.












Click it and Unblock the Notifications