బొత్సకు సుప్రీంలో ఊరట: పిటిషనర్‌కు సూటి ప్రశ్న

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఊరట లభించింది. 'మీరు చెప్పినట్లే కేబినెట్‌లో ఇద్దరు అవినీతి మంత్రులు ఉన్నారనుకుందాం. అంత మాత్రాన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేయాలా!?'... ఇ.గిరియాదవ్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు సూటిగా వేసిన ప్రశ్న ఇది. మద్యం కుంభ కోణంలో పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ పాత్ర ఉందని ఆరోపిస్తూ సుప్రీంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ చంద్రమౌళి కేఆర్ ప్రసాద్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. బొత్స సత్యనారాయణపై పాత్రపై విచారణ జరపాలని దాఖలైన ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ దాడుల్లో బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు లిక్కర్ షాపులు న్నాయన్న వాస్తవం బయటపడిందని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇందులో ప్రమేయం ఉందంటూ ఏసీబీ దాడుల నివేదిక పేర్కొందని గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆ నివేదికను తన వద్ద పెట్టుకుని ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులను చెప్పుచేతల్లో ఉంచుకున్నారని ఆరోపించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై మాత్రం దాడులు చేయించారన్నారు.

ఏసీబీ దాడుల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, సోనియాకి బొత్స లేఖలు రాశారన్నారు. ఈ లేఖ రాసిన మూడు రోజులకే ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిని సీఎం ముఖ్యమంత్రి మా ర్చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో రా జ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్రం కూడా జోక్యం చేసుకోవటం లేదన్నారు.

ప్రధాని మన్మోహన్‌ సింగ్ గురించి కూడా రామచంద్రరావు ఏదో అనబోతుండగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు జోక్యం చేసుకుంటూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అనుమతించబోమ న్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి జీతాలు తీసుకుంటోంది ప్రజల నుంచే కాబట్టి, వారు తప్పు చేస్తే ప్రజలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తారని చెబుతూ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+