ధర్మానను వివరణ కోరా, వచ్చాక నిర్ణయం: సిఎం

Kiran Kumar Reddy
మహబూబ్‌నగర్: రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాద రావు నుంచి వివరణ కోరినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై ఆయన శనివారం స్పందించారు. సిబిఐ చార్జిషీట్‌లో పేరు చేర్చిన విషయంపై ధర్మాన ప్రసాద రావు నుంచి వివరణ కోరానని, వివరణ రాగానే రాజీనామాపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శనివారం రాజీవ్ గృహకల్పను ప్రారంభించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంపై కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈ నెల 25వ తేదీన తమ ముందు హాజరు కావాలని సిబిఐ కోర్టు ధర్మాన ప్రసాదరావుకు సమన్లు జారీ చేసింది. సిబిఐ దాఖలు చేసిన వాన్‌పిక్ చార్జిషీట్‌ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి లేకపోవడంతో ధర్మాన, మోపిదేవి వెంకటరమణలపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను కోర్టు పక్కన పెట్టింది.

ఐఎఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శామ్యూల్‌లపై ఐపిసి అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 25వ తేదీన తమ ముందు హాజరు కావాలని వీరికి కోర్టు సమన్లు జారీ చేసింది. వైయస్ జగన్, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలకు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడగించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావును సిబిఐ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.

సిబిఐ ఛార్జిషీటులో పొందుపర్చిన అభియోగాలు, ఆరోపణలను తప్పుపట్టబోమని, న్యాయకోవిదులు తాను తప్పు చేయలేదని చేప్పేదాక వెనక్కితగ్గేది లేదని మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో స్పష్టం చేసారు. తప్పుచేసినవాడు రాజకీయాల్లో తప్పించుకోలేడని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన 33 రోజుల అనంతరం ఆయన శ్రీకాకుళం వెళ్లి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

అభియోగాలు వచ్చినంత మాత్రాన నేరం రుజువు అయినట్టు కాదని, సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేస్తే అరెస్టు చేయాలనేం లేదనే విధివిధానాలు విపక్షాలకు తెలిసినప్పటికీ, తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకూ సమంజషమో వారి విచక్షణకే వదిలేశానన్నారు. కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ రూపొందించుకునేందుకే విపక్షాలు తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ సహనంతో మౌనం వహిస్తున్నానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+