ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుదర్శన్ కన్నుమూత

కుప్పలి సీతారామయ్య సుదర్శన్ 1931 జూన్ 18వ తేదీన రాయ్‌పూర్‌లో జన్మించారు. 1954 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2000 - 2009 మధ్య ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డియే ప్రభుత్వ హయాంలో ఆయన వాజ్‌పేయి, అద్వానీలకు కీలక సూచనలు చేశారు. 2009 మార్చి 31వ తేదీన ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.
సుదర్సన్ భౌతిక కాయానికి ఆదివారం నాగపూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన భౌతిక కాయాన్ని రాయ్‌పూర్ నుంచి నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి తరలిస్తారు. ఆయన మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయనకు తుది వీడ్కోలు చెప్పడానికి నాయకులు నాగపూర్ తరలి వెళ్తున్నారు.
సుదర్శన్‌కు సోదరుడు ఉన్నారు. మైసూరులోని తన సోదరుడి నివాసం నుంచి ఆయన కనిపించకుండా పోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. దారి తప్పిన ఆయన లలిత మహల్ సమీపంలో రోడ్డుపై కూర్చుని కనిపించారు. ఎన్డియె ఆర్థిక విధానాలను తప్పు పట్టిన నేతల్లో సుదర్శన్ ముఖ్యుడు.












Click it and Unblock the Notifications