వైఎస్‌విజయమ్మతో అసదుద్దీన్ భేటీ: వైయస్‌కు కితాబు

ప్రజా సమస్యలపై వైయస్ తక్షణమే స్పందించే వారని, వైయస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరుచూ తాను ఆయనతో సమావేశమయ్యే వాడినని, ఇప్పుడు వైయస్ విజయమ్మ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
మరోవైపు కర్నూలు, కడప జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఢప్తి చేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు హామీ రాలేదన్నారు.
రైతులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ సంక్షోభంపై చర్చ సమయంలో కుట్ర పూరితంగా సభను వాయిదా వేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకుండా పోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications