అల్లుడు కావాలా ? మేం కావాలా ? మమతకు వీర విధేయుడి అల్టిమేటం..!
బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీని వీడి 60కి పైగా ఎమ్మెల్యేలు, 20కి పైగా ఎంపీలు వేరు కుంపట్లు పెట్టేసుకున్నారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్ సభలోనూ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పలేదు. అదే సమయంలో రోజుకో రాజ్యసభ ఎంపీ రాజీనామా చేస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక మమతా బెనర్జీ దిక్కులు చూస్తున్న వేళ ఆమెకు వీర విధేయుడైన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) మరో షాకిచ్చారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇవాళ మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న సంతకాల ఫోర్జరీ కేసు, దానికి అనుబంధంగా ఉన్న సీఐడీ సోదాల కేసులో అభిషేక్ తనను చివరి నిమిషంలో తనను న్యాయవాదిగా తొలగించారని, ఇది అవమానకర చర్య అని కళ్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. తాజాగా పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు మమతను వీడుతున్నప్పటికీ ఆమె పక్షాన నిలబడిన కళ్యాణ్.. చివరికి చేసేది లేక మమ్మల్ని లేదా అభిషేక్‌ను ఎంచుకోవాలని మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చేశారు.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న అభిషేక్‌కు, ఫోర్జరీ కేసులో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ, ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు బెంగాల్ సీఐడీ ఎదుట హాజరు కావాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో తన స్థానంలో మరొకరిని న్యాయవాదిగా నియమించారని కళ్యాణ్ బెనర్జీ ఆ తర్వాత పేర్కొన్నారు. మమతకు విధేయుడైన ఆయన, అభిషేక్‌ను అతి అహంకారిగా వర్ణించారు. అభిషేక్ సీనియర్లను అగౌరవపరిచారని, తనను ఎప్పుడూ నమ్మలేదని, పార్టీ పతనానికి ఆయనే కారణమని కూడా కళ్యాణ్ ఆరోపించారు.














Click it and Unblock the Notifications