తెలంగాణ కోసం మంజీరలో జలదీక్షతో వినూత్న దీక్ష

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా 2009 డిసెంబర్ 9కి ముందు తెలంగాణకు అనుకూలంగా ఉండి ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారని, ఇటీవల తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమని తెలంగాణ టిడిపి నేతలు ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు వారు ఆ లేఖ ఇవ్వాలదని, టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని, కేంద్రానికి లేఖ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్రం ఇప్పటి వరకు ఎన్నోసార్లు తమ ప్రాంత ప్రజలను మోసం చేసిందని, ఇక నుండి ఆ మోసాన్ని సహించేది లేదని వెంటనే తెలంగాణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాకుంటే ఇంకెప్పుడూ రాదన్నారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తే తాము దీక్ష విరమిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ
సెప్టెంబర్ 30వ తేదిన తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్ జిల్లా హన్మకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేయి స్తంభాల గుడి నుండి అమరవీరుల స్థూపం వరకు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం ర్యాలీ చేపట్టింది.
తెలంగాణకు జరిగిన నష్టాన్ని తెలియజెప్పుతాం.. టి-లాయర్ల జేఏసి
అక్టోబర్ 1 నుండి 19 వరకు జరగనున్న జీవ వైవిధ్య సదస్సులో తెలంగాణ సంస్కృతికి జరిగిన అన్యాయాన్ని తాము ప్రపంచానికి తెలియజేస్తామని తెలంగాణ అడ్వోకేట్ జేఏసి ప్రకటించింది. ఇందుకు సంబంధించి బుక్ లెట్ ప్రచురించినట్లు చెప్పారు. ఈ సదస్సుకు 190 దేశాల నుండి దాదాపు పదిహేను వేల మంది ప్రతినిధులు వస్తున్నారని వారి దృష్టికి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తీసుకు వెళ్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications