అది తెలుసు: చెట్లకు డబ్బులుపై ప్రధానికి మోడీ కౌంటర్

డబ్బు చెట్లకు కాయదని ఈ దేశ ప్రజలకు కూడా తెలుసునని ఆయన ప్రధానమంత్రిపై వ్యంగ్యాస్త్రం విసిరారు. 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణాలను కాంగ్రెసు పార్టీ తన డబ్బు చెట్టుగా మార్చుకుందని తాను నిక్కచ్చిగా ఆరోపిస్తున్నానని, ఈ డబ్బు చెట్టు దేశాన్ని సర్వనాశనం చేస్తోందని మోడీ మండిపడ్డారు.
కాగా భారత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి సంస్కరణలు కొత్త అవకాశాన్ని కల్పిస్తున్నాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం చెప్పిన విషయం తెలిసిందే. డబ్బు చెట్లకు కాయదని, సబ్సిడీలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను ఏ ప్రభుత్వమూ తీసుకోదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని, ఇటువంటి పరిస్థితులలో క్లిష్టమైన నిర్ణయాలను కఠినంగా అమలు చేయకపోతే దేశం పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
తమ యుపిఎ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం కొనసాగింపునకు ఎటువంటి అవరోధాలూ లేవని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ దురుద్దేశాలతో చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య రంగాలలో ఎన్నో ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చామంటూ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకోసమేనని ఆయన వివరించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలకముందే ఎన్నో గట్టి చర్యలను అమలు చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications