ప్రేమించలేదని..: యువకుల ఘాతుకం, రేప్‌కు యత్నం

Jilted lover kills school girl, after attempting rape
విజయవాడ/చెన్నై: తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు విద్యార్థినిపై యాసిడ్ పోసిన ఘటన కృష్ణా జిల్లాలోని తిరువూరులో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం చంటి అనే ప్రేమోన్మాది.. ఓప్రయివేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పద్మావతిపై యాసిడ్ పోశాడు. ఇద్దరూ ఒకే కాలనీకి చెందిన వారు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా పద్మావతిని అడ్డగించిన చంటి మాట్లాడేది ఉంది రమ్మంటూ పక్కకు పిలిచే ప్రయత్నం చేశాడు.

అందుకు నిరాకరించిన పద్మావతి అక్కడ నుండి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అతను ఆమెపై యాసిడ్ పోశాడు. యాసిడ్ బాలిక మొహంపై కాకుండా నడుం పైన, చేతుల పైన కొద్దిగా పడింది. దీంతో ప్రమాదం తప్పింది. పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కోయంబత్తూరులో గొంతు కోసిన ఉన్మాది

కోయంబత్తూరులో ప్రేమలో విఫలమైన ఓ యువకుడు 14 ఏళ్ల అమ్మాయిని హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అమ్మాయి కూడా తొమ్మిదో తరగతి విద్యార్థినే. కోయంబత్తూరులోని కొవై గణపతి ప్రాంతంలో ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న అభినయను అదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ అనే 21 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు.

అభినయ అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో వేణుగోపాల్ ఉన్మాదిలా మారి.. శనివారం మధ్యాహ్నం అభినయ ఒంటరిగా ఉండటం చూసి, ఆమెతో మాటలు కలిపి ఇంట్లోకి వెళ్లాడు. మొదట ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. విద్యార్థిని ప్రతిఘటించింది. అంతలో ఆమె తల్లి కూడా వచ్చినట్లుగా ఉన్మాది గమనించాడు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ప్రాణాపాయం తప్పింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+