ఛార్జీల పెంపు: నారాయణ అరెస్ట్, పరీక్ష.. విజయమ్మ

ప్రభుత్వం డెకాయిట్‌గా వ్యవహరిస్తోందని, రాత్రికి రాత్రే ప్రభుత్వం ఛార్జీలను పెంచడం దారుణమన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెసుకు కాలం దగ్గర పడిందని, ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసలహాలు అందిస్తున్న ప్రభుత్వం ప్రజలపై భారం వేయడంలో మాత్రం వెనుకాడటం లేదన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై ఛార్జీలు తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.
బస్ భవనాన్ని ముట్టడించేందుకు పలు విద్యార్థి సంఘాలు కూడా ప్రయత్నించాయి. బస్ భవనంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యే సమయంలో చంద్రబాబు బస్సు ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు.
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరల పెంపు వల్ల ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచిందన్నారు. డీజిల్ ధర పెంపుతో రాష్ట్రానికి రూ.800 కోట్లు లాభం వస్తుందన్నారు. బిటి విత్తనాల వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. పెరిగిన బస్సు ఛార్జీలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసి ఛార్జీలు పెంచి, విద్యుత్ ధరలు పెంచి రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications