జగన్ సంగతేంటి: ధర్మానకు జూపూడి, మేళతాళాలతో...

Jupudi Prabhakar Rao
చెన్నై/హైదరాబాద్: తమను నేరస్తులుగా, కళంకిత మంత్రులుగా చిత్రీకరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు సోమవారం స్పందించారు. కేవలం ఆరోపణలు వచ్చినందుకే మంత్రులు ఇంతగా భయపడుతుంటే.. ఏ నేరం చేయని తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 118 రోజులుగా జైలులో ఉంటున్నారని, దానికి అతడు ఎంత క్షోభ అనుభవించాలని ప్రశ్నించారు.

ఏ తప్పు చేయకుండానే జైలులో ఉంటున్నందుకు జగన్ ఎంతగా బాధపడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు. మంత్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తే మంచిందన్నారు. ప్రభుత్వం బేషరతుగా జగన్‌కు క్షమాపణలు చెప్పి, జైలు నుండి విడుదల చేయించి.. మేళతాళాలతో ఆయన ఇంటి వద్ద వదిలి పెట్టాలన్నారు. తప్పు చేయలేదని మంత్రులు అంటుంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు ప్రభుత్వం ఎందుకు దీనిని చెప్పడం లేదన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హైదరాబాదులో డిమాండ్ చేశారు. డిమాండును బట్టి ప్రభుత్వ సర్ ఛార్జీలు పద్ధతి కాదన్నారు. పేదలు, సామాన్యులపై తీవ్రమైన భారం పడుతుందని, 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడా తన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల ఎకరాలు ఎండిపోతుంటే ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు.

పెరిగిన బస్సు ఛార్జీలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆర్టీసి ఛార్జీలు పెంచి, విద్యుత్ ధరలు పెంచి రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షిస్తోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+