బాబు వేషాలు నమ్మరు, జగన్‌ను సిఎం చేస్తాం: చెంగల

వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఉపఎన్నికల్లో టిడిపికి గుణపాఠం చెప్పారని, అయినా బాబుకు బుద్ది రాలేదన్నారు. సరికదా పాదయాత్రకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు బాబుపై నమ్మకం పోయిందన్నారు. ఆయన ఎన్ని నాటకాలు ఆడినా విశ్వసించేవారు లేరన్నారు. వచ్చే నెల 29న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు.
పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేసి జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యమన్నారు. కాగా తాను ఎలాంటి పదవులు ఆశించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం లేదని పాయకరావుపేట మాజీ శాసనసభ్యుడు చెంగల వెంకట్రావు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కొణతాల క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కొణతాల రామకృష్ణను కలిశారు. సుమారు 20 నిమిషాలపాటు వీరిద్దరూ భేటీ అయ్యారు. అనంతరం చెంగల విలేఖరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారని, దీంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు.
ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని దైవంగా కొలుస్తున్నారని, అందుకే ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రజల అభీష్టం మేరకు అక్టోబర్ 15 తర్వాత ఆ పార్టీలో చేరతాన్నారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడి కుటుంబానికి మేలు చేశాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నదని ఆరోపించారు. వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications