సిఎం నితీష్‌కు చెప్పు చూపించిన నిరసనకారుడు?

అయితే పోలీసులు మాత్రం అలాంటిదేం లేదని, ఈ సంఘటన జరగకముందే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ప్రసంగాన్ని ముగించుకొని వేదిక పై నుండి వెళ్లి పోయారని చెబుతున్నారు. ఈ వార్తలు వాస్తవం కాదని చెప్పారు. కాగా అంతకుముందు శుక్రవారం రోజు కూడా నితీష్ కుమార్ సమావేశం వైపు నిరసనకారులు చెప్పు విసిరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ చెప్పు మరో నేతను లక్ష్యంగా చేసుకొని విసిరినట్లు చెబుతున్నారు.
శుక్రవారం రోజు నితీష్ కుమార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని లోరియా నియోజకవర్గంలో పర్యటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి అధికార జనతా పార్టీ(యు) నేత ప్రదీప్ సింగ్ పైకి నితీష్ కుమార్ ఉండగానే చెప్పు విసిరాడు. అయితే ఈ చెప్పు ఎవరికి తగల్లేదు. చప్పల్ విసిరిన వెంటనే నితీష్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ చెప్పు సదరు వ్యక్తి నితీష్ కుమార్ పైకి విసరలేదని, అధికార పార్టీ నేత ప్రదీప్ సింగ్ పైన కోపంతో విసిరారని పోలీసులు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల సహాయ కోసం చేసిన పంపిణీలో వివక్ష చూపించారని ఆరోపిస్తూ వారు ప్రదీప్ పైన ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications