ఎఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్ గాంధీ?

తృణమూల్ కాంగ్రెసు తప్పుకున్న తర్వాత ఖాళీ అయిన రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన సిపి జోషీ సోనియా గాంధీని కలిసినవారిలో ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో కూడా సోనియా చర్చలు జరిపారు. చవాన్‌తో పాటు నారాయణ రాణేకు, మరికొంత మంది మహారాష్ట్రకు చెందిన నాయకులకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మహోన్ ప్రకాష్ కూడా సోనియాను కలిశారు.
పృథ్వీరాజ్ చవాన్‌ను ముఖ్యమంత్రిగా పంపడంతో, విలాస్ రావు దేశ్‌ముఖ్ మరణించడంతో మహారాష్ట్రకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో రెండు బెర్తులు ఖాళీ అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్, ఎఐసిసి కోశాధికారి మోతిలాల్ వోరా, తన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లతో ఆమె చర్చలు జరిపారు.
గులాం నబీ ఆజాద్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించి ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తృణమూల్ కాంగ్రెసు వైదొలగడంతో ఖాళీ అయిన ఆరు మంత్రి పదవుల్లో రెండు లేదా మూడు పశ్చిమ బెంగాల్‌కు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. బేణీ ప్రసాద్ వర్మ, కపిల్ సిబాల్, సిపి జోషి, వీరప్ప మొయిలీ, వాయలార్ రవి రెండేసి శాఖలు నిర్వహిస్తున్నారు. వారి నుంచి ఒక్కో శాఖను తొలగించి కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చిరంజీవితో పాటు మరో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇది తెలంగాణపై తీసుకునే నిర్ణయంపై ఆధారపడవచ్చునని అంటున్నారు. రాహుల్ గాంధీకి పార్టీలో పెద్ద బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఎఐసిసి కార్యదర్శివర్గంలో మార్పులుంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications