హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మానకు జగన్ షేక్‌హ్యాండ్: తల్లితో మాట్లాడేందుకు ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - YS Bharathi
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం పది గంటలకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు తరలించారు. జగన్ తరలింపు నేపథ్యంలో జైలు నుండి కోర్టు వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌ను ప్రత్యేక స్కార్పియో వాహనంలో కోర్టుకు తరలించారు. ఆయనతో పాటు ఈ కేసులో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను కూడా కోర్టుకు తరలించారు.

కోర్టుకు జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి, తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయ సాయి రెడ్డి వచ్చారు. జగన్ ఆస్తుల కేసులోనే వాన్‌పిక్ కేటాయింపుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొని సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, ధర్మానలు కోర్టు వద్ద షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కాగా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జగన్‌కు అరగంట సమయం ఇచ్చారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో కోర్టు అనుమతించింది.

జగన్ ఆస్తుల కేసులో రెండో ఛార్జీషీట్ నిందితుల కేసు విచారణను కోర్టు అక్టోబర్ 9వ తేదికి వాయిదా వేసింది. జగన్, ధర్మాన కోర్టుకు హాజరైన అనంతరం వాన్ పిక్ భూకేటాయింపులపై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. కాగా సిబిఐ ఇటీవల వాన్‌పిక్ వ్యవహారంపై ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ధర్మాన మొదటిసారి కోర్టుకు హాజరయ్యారు.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy gave shake hand to minister Dharmana Prasad Rao in court hall on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X