తిరిగి జైలుకు జగన్: ధర్మానకు విజయమ్మ పలకరింపు

వాన్‌పిక్ కేసుపై విచారణ వాయిదా పడిన అనంతరం జగన్ పిటిషన్ మేరకు కోర్టు అతనికి అరగంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించింది. దీంతో అతను తన తల్లి, పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి రెడ్డి తదితరులతో కాసేపు మాట్లాడారు. జగన్‌ను కలిసేందుకు చాలామంది వచ్చినప్పటికీ వారిని అనుమతించలేదు. అంతకుముందు కోర్టుకు వచ్చిన ధర్మానకు జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం జగన్‌ను తిరిగి జైలుకు తరలించారు. ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలు కూడా కరచాలనం చేసుకొని పలకరించుకున్నారు. వైయస్ విజయమ్మ కూడా ధర్మానను నవ్వుతూ పలకరించారు. జగన్, ధర్మాన, మోపిదేవిలు కోర్టుకు రావడంతో కోర్టు వద్ద అంత కోలాహలం కనిపించింది. కోర్టులో ధర్మానను న్యాయమూర్తి పిలిచిన సమయంలో ఆయన నిందితులు నిల్చునే స్థానంలో ఉన్నారు. కోర్టు జగన్ రిమాండ్‌ను అక్టోబర్ 9వ వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications