• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మార్చ్: 'విజయమ్మ, బాబు'ను ప్రస్తావించిన పాల్వాయి

By Srinivas
|

Palvai Goverdhan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటనలకు ఐదు వేల మందితో పహారా కాసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మార్చ్‌కు భద్రత కల్పించ లేదా అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. మార్చ్‌ను హింసాత్మకంగా మార్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు.

భారీగా బలగాలను తరలించి తెలంగాణ మార్చ్ శాంతియుతంగా జరిగేలా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోబోతుందని, దీనికి ఎవరు అడ్డుపడ్డా బుల్దోజర్ కింద పడినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంద్రి ఢిల్లీ పెద్దలను కొనడం ద్వారా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు గతంలో తెలంగాణను అడ్డుకున్నారని, కానీ తెలంగాణ ప్రజల గొంతును మాత్రం నొక్కలేక పోయారన్నారు.

సెప్టెంబర్ రెండో వారంలో తెలంగాణపై లేఖ ఇస్తానని చెప్పిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు లేఖ ఎందుకు ఇవ్వలేని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ వేరుగా ప్రశ్నించారు. చంద్రబాబు తన పాదయాత్ర కంటే ముందుగానే తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలన్నారు. తెలంగాణపై బాబు తన వైఖరిని ప్రకటించని పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలు ఆయన యాత్రను అడ్డుకుంటారన్నారు.

జీవ వైవిధ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా తెలంగాణవాదులు ఆలోచించరని పొన్నం తెలిపారు. తెలంగాణ కవాతుకు ముందే ముఖ్యమంత్రి కిరణ్, తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రత్యేక రాష్ట్ర ప్రాధాన్యతను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర విభజన పైన సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకే రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని రుజువైందని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించి ఇమేజ్‌ను తగ్గించుకోవద్దని ఈటెల రాజేందర్ పలు పార్టీలకు సూచనలు చేశారు. హైదరాబాదును పోలీసులు అష్టదిగ్బంధం చేశారన్నారు. తెలంగాణవాదంతో చెలగాటం ఆడవద్దని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కవాతు చేసి తీరుతామన్నారు.

తెలంగాణ ఇస్తే తీసుకుంటాం లేదా పోరాడి సాధించుకుంటామని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మార్చ్ ఆపే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు దమ్ముంటే అనుమతి తీసుకు రావాలని లేదా మార్చ్‌లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ దమ్మంటే కాంగ్రెసుకు చూపిస్తామన్నారు.

English summary
Congress senior leader and Rajyasabha Member Palvai Goverdhan Reddy has questioned Kiran Kumar Reddy government about Telangana march.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X